ఆక్స్‌ఫర్డ్ …కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్..!

110
corona

కరోనాపై పోరులో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా దగ్గర దగ్గర 120కు పైగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతుండగా ఇందులో ముందడుగు పడింది. ఆక్స్ ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ సక్సెస్ ఫుల్ అయినట్లుగా ప్రముఖ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పేర్కొంది.

ట్రయల్స్ లో భాగంగా, వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించడంలేదని, పైగా రెట్టింపు రక్షణ కలుగుతోందని ఆస్ట్రాజెనెకా వర్గాలు తెలిపాయి. యాంటీబాడీలతో పాటు వ్యాక్సిన్ ఇచ్చినవారిలో ఇమ్యూనిటీ సైతం బాగా పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇమ్యూనిటీ పెరగటానికి ఉపయోగపడే టీ కణాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని పరిశోధకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎవరిలోనూ రియాక్షన్ కనిపించలేదని వెల్లడించారు.