నిమ్స్‌లో రెండోదశ క్లినికల్ ట్రయల్స్‌…

98
corona

దేశంలో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ రెండో దశ ప్రయోగం ప్రారంభమయ్యాయి. నిమ్స్‌లో మొదటిదశ విజయవంతం కావడడంతో రెండోదశ ట్రయల్స్‌ కోసం టీకాలు వేస్తున్నారు.

టీకా తీసుకున్న వలంటీర్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ క్రమంలో రెండో దశ ట్రయల్స్‌లో దేశవ్యాప్తంగా 380 మందికి టీకా ప్రయోగం చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం రెండో దశ టీకాలు వేయడం ఆరంభించారు.

దేశంలోనే ఫార్మా దిగ్గజమైన భారత్‌ బయోటెక్‌ ఫార్మాసూటికల్‌ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌ టీకా ప్రయోగానికి దేశంలోని 12 ఆస్పత్రులను ఎంపిక చేయగా అందులో నిమ్స్‌ ఆస్పత్రి ఒకటి.