బీజేపీ ఎమ్మెల్యేకు ఓవైసీ సవాల్!

1
- Advertisement -

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ‘కాజీ క్యాంప్’ ప్రాంతంపై మిసైల్ (క్షిపణి) దాడి చేస్తానంటూ బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేకు ఓవైసీ నేరుగా బహిరంగ సవాల్ విసిరారు.

భోపాల్‌లోని కరోంద్ స్క్వేర్ నుంచి మైనారిటీలు అధికంగా ఉండే కాజీ క్యాంప్ వైపు మిసైల్ ప్రయోగిస్తానని బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై భోపాల్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ అత్యంత ఘాటుగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే రమేశ్వర్ శర్మ విను.. నీకు నిజంగా ధైర్యముంటే, ఆ మిసైల్‌ను ఎప్పుడు ప్రయోగిస్తావో చెప్పు? నేను ఒక్కడినే వెళ్లి ఆ కాజీ క్యాంప్‌లో నిలబడతాను. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి, అమరవీరుడిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప నీలాంటి వారి ముందు తలవంచే ప్రసక్తే లేదు అని ఓవైసీ ధ్వజమెత్తారు.

అలాగే భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కాజీ క్యాంప్‌కు చెందిన పలువురు యోధులు చేసిన త్యాగాలను, దానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ఓవైసీ గుర్తుచేశారు.ఈ సందర్భంగా కేవలం స్థానిక అంశాలపైనే కాకుండా సమాన పౌర స్మృతి (UCC), ఇతర జాతీయ అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల తీరుపై ఓవైసీ మండిపడ్డారు.

Also Read:కాంగ్రెస్ పథకాలు..ట్రంప్ కాపీ!

- Advertisement -