కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘గ్యారెంటీ పథకాల’ మోడల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. భారతీయ రాష్ట్రాలే కాకుండా ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తమ ఆలోచనలనే అనుకరిస్తున్నారని ఆయన అనడం రాజకీయా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
విశ్వవ్యాప్తమైన కాంగ్రెస్ నమూనా బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించారు. మా ప్రభుత్వ గ్యారెంటీ పథకాలను చూసి ముందుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ వంటి భారతీయ రాష్ట్రాలు కాపీ కొట్టాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మన ఆలోచనలనే అనుకరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయ అనడానికి ఇదే నిదర్శనం. ఈ రోజు ప్రపంచమంతా మన రాజ్యాంగాన్ని, ప్రజా సంక్షేమ నమూనాను గమనిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో ప్రతి పౌరుడికి డోనాల్డ్ ట్రంప్ $5,000 డాలర్లు (సుమారు ₹4.15 లక్షలకు పైగా) ‘ట్రంప్ డివిడెండ్’ పేరిట ఇస్తామని ప్రకటించిన అంశాన్ని ఈ సందర్భంగా డీకే శివకుమార్ గుర్తుచేశారు. ట్రంప్ తన ఓటర్లకు 5,000 డాలర్లు ఇస్తానని చెబుతున్నారు. నాకు ఓటు వేయండి.. మీకు డాలర్లు ఇస్తాను అని ఆఫర్ చేస్తున్నారు అంటే నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ నమూనానే ప్రపంచ అగ్రరాజ్య అధినేత కూడా అమలు చేయాలనుకుంటున్నారు” అని ఆయన విశ్లేషించారు.
తమ ప్రభుత్వం ప్రజల ఆర్థిక శ్రేయస్సే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తోందని, ఏ కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తోందని డీకే తెలిపారు. తమ ఆలోచనలు ఈరోజు ప్రపంచ స్థాయి రాజకీయ వేదికలపై ప్రతిబింబిస్తుండడం కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!

