కష్టాల ఊభిలో కామన్‌ మ్యాన్‌.. పెరగనున్న ఔషధాల ధ‌ర‌లు..

110
- Advertisement -

ఇకవైపు నిత్యావసరాల ధరలు..మరోవైపు గ్యాస్‌, ఇంధన ధరలు పెంపుతో సామాన్య మానవుడు సతమతమౌతున్నాడు.. ఇలాంటి సమయంలో కామన్‌ మ్యాన్‌పై మరింత భారం పడనుంది. అసలు విషయానికొస్తే.. ఇప్పుడు మందుల ధ‌ర‌లు పెరనున్నాయి.. బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, అనీమియా వంటి వాటితో పాటు జ్వరం, ఇన్ఫెక్షన్ల‌కు వాడే అత్యవసర మందుల ధరలు ఏప్రిల్‌ నుంచి పెర‌గ‌నున్నాయి. వీటి ధరలు 10.8శాతం పెరగనున్నట్లు జాతీయ ఔషధాల ధరల సంస్థ (ఎన్‌పీపీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది.

అత్యవసర ఔషధాల జాబితాలో ఉండే 800 షెడ్యూల్డ్‌ మందుల ధరలు ఈ మేర‌కు పెరుగుతాయి. ప్ర‌జ‌లు ఎక్కువగా వాడే పారాసెటమాల్ తో పాటు ఫెనోబార్బిటోన్‌, ఫెనిటోయిన్‌ సోడియం, మెట్రోనిడజోల్, అజిత్రోమైసిన్ వంటి ఔషధాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క‌రోనా కార‌ణంగా ఔష‌ధాల‌ తయారీ ఖర్చులు కూడా పెరిగాయి. ఈ నేప‌థ్యంలోనే వాటి ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

- Advertisement -