ఔటా విజ్ఞప్తిని సీఎం దృష్టికి తీసుకెళ్తా: వినోద్ కుమార్

398
trs vinod kumar
- Advertisement -

ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ( ఔటా ) సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీనిచ్చారు. గురువారం కూకట్ పల్లిలోని తన నివాసంలో ఔటా ప్రతినిధులు వినోద్ కుమార్ ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.

యూనివర్సిటీ అధ్యాపకుల వయోపరిమితిని 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచేలా సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళాలా చూడాలని ఔటా ప్రతినిధులు కోరారు. యూనివర్సిటీలలో అధ్యాపకులు, మినిస్టీరియల్ సిబ్బంది బాగా తగ్గిపోతోందని వారు తెలిపారు. వయోపరిమితి పెంచేలా కృషి చేయాలని వారు కోరారు

- Advertisement -