ఓటీటీలో అలరిస్తున్న చిన్న చిత్రాలివే

64
- Advertisement -

ఓటీటీల్లో కూడా ఇప్పుడు పోటీ ఎక్కువ అయ్యింది. పైగా రిమోట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. వారి ఆసక్తిని కంట్రోల్ లోకి తెచ్చుకుని.. ఓటీటీలో ఓ సినిమా హిట్ కావడం ఇప్పుడు గగనం అయిపోయింది. ఐతే, ప్రస్తుతం రెండు తెలుగు చిన్న సినిమాల పై ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ, ఆ చిత్రాల సంగతి ఏంటో చూద్దాం రండి. యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయిన సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్. చాయ్ బిస్కెట్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. దాదాపు 30 మంది కొత్త నటీనటులతో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మేము ఫేమస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఫ్రెండ్‌ షిప్‌, లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీని టాప్ ప్రొడక్షన్ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌ పంపిణీ చేసింది. మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అన్నట్టు ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా ఓటీటీలో హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యింది.

Also Read:‘ఆదిపురుష్’ కు అలహాబాద్ కోర్టు షాక్

అయితే, థియేటర్ ప్రేక్షకులను అలరించలేకపోయినా.. ఓటీటీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం పేరే ‘విమానం’. సముధ్రఖని, అనసూయ ప్రధాన పాత్రలో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ ‘విమానం’.. ఈ నెల 9న థియేటర్లలో రిలీజై నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కమర్షియల్ గా కనీస కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను మాత్రం బాగానే మెప్పిస్తుంది.

Also Read:షుగర్ పేషెంట్లకు ఈ మొక్క.. అద్బుతవరం!

- Advertisement -