షుగర్ పేషెంట్ల కోసమే!

51
- Advertisement -

నేటిరోజుల్లో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నా దాని ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారట. రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గుల కారణంగా మధుమేహం వ్యాధి వస్తుంది. ఒక్కసారి ఈ షుగర్ బారిన పడితే దీని నుంచి బయటపడడం అంతా ఈజీ కాదు. మధుమేహం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది,.

శ్వాస సంబంధిత వ్యాధులు మరియు గుండె సమస్యలకు డయాబెటిసే మూల కారణం. అందుకే షుగర్ వ్యాధి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు వివిధ రకాల మెడిసన్స్ వాడుతుంటాము. కానీ సరైన ఫలితాలు కనిపించవు. ఆయుర్వేద ఔషద తయారీలో విరివిగా వినియోగించే బ్రహ్మీ మొక్క డయాబెటిస్ కు దివ్య ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్1, టైప్2 డయాబెటిస్ లక్షణాలను ఆధుపులో ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

Also Read: యంగ్ గా కనిపించాలంటే..ఇలా చేయండి!

బ్రహ్మీ ఆకులను నేరుగా తిన్నా లేదా కషాయంలా చేసుకొని సేవించిన అద్బుతమైన ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బ్రహ్మీ ఆకుల లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ప్రిరాడికల్స్ తో పోరాడడానికి ఎంతో ఉపయోగ పడతాయి. ఈ బ్రహ్మీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఆయుర్వేద షాపులలో బ్రహ్మీ ఆకులు పొడి రూపంలో లభిస్తుంది. ఈ పొడిని ఉదయం సాయంత్రం కొద్దిగా తేనెతో కలుపుకొని తింటే గుండె, కాలేయం, ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ బ్రాహ్మీ ఆకులను గాని పొడిని గాని క్రమం తప్పకుండా సేవించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -