‘ఆదిపురుష్’ కు అలహాబాద్ కోర్టు షాక్

17
- Advertisement -

ఆదిపురుష్ మేకర్స్‌కు అలహాబాద్ కోర్టు షాక్ ఇచ్చింది. సినిమా బ్యాన్ చేయాలని దాఖలైన పిల్‌పై విచారణ చేపట్టింది. ఈ నెల 27న డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్, నిర్మాత కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మూవీపై అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనుంది. అలాగే చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని పునరాలోచన చేయాలని కేంద్రానికి సూచించింది.

మరోవైపు ఆదిపురిష్ చిత్ర తమిళ్ వర్షన్ ఒరిజినల్ ప్రింట్ పైరసీలోకి వచ్చేసింది. దీంతో చిత్రయూనిట్ కి భారీ షాక్ తగిలింది. దీంతో వీలైనంత త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. వాస్త‌వానికి ఆదిపురుష్ ఆగ‌స్ట్‌లో ఓటీటీకి రావాల్సింది. కానీ ఒరిజినల్ ప్రింట్ ముందే లీక్ కావడంతో.. ప్రకటించిన డేట్ కంటే ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వ‌స్తుంద‌ని నెట్టింట గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌న్నీ నిజం కాద‌ని, ముందు చెప్పిన‌ట్లు ఆగ‌స్ట్‌లోనే ఆదిపురుష్ ఓటీటీలోకి వ‌స్తుంద‌ని మేకర్స్ చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు.

Also Read:Maharashtra:బస్సులో మంటలు…25 మంది మృతి

ఇటు చూస్తే. ఆదిపురుష్ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ మూవీ మొదటి నుంచి వివాదాలతోనే సాగుతోంది. ఇక మొదటి మూడు రోజులు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. దాంతో బయ్యర్లు భారీ మొత్తంలోనే నష్టపోయారు.

Also Read:లండన్‌లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’..

- Advertisement -