అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. పలు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తున్నారు. నిజానికి ఆస్కార్ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జీవితంలో ఓ సారైనా ఆస్కార్ ను అందుకోవాలని ప్రతి సినిమా వ్యక్తి కలలు కంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో 96వ ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరుగుతుంది.
మరి 96వ ఆస్కార్ అవార్డు విజేతల జాబితాను చూద్దామా
ఉత్తమ చిత్రం: ఓపెన్ హైమర్
• ఉత్తమ దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్
• ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ
• ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్
• ఉత్తమ ఒరిజినల్ స్కోర్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్
• ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్ హైమర్
• ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు కోసం ఆర్ఆర్ఆర్ యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు పెట్టింది అని టాక్ ఉంది. పైగా కేవలం ఆర్ఆర్ఆర్ టీమ్ ఫ్లైట్ టికెట్ల కోసమే కోట్లు ఖర్చు పెట్టారట. అయితే ఈ సారి ఆ స్థాయిలో ఖర్చు పెట్టే చిత్రబృందం లేకపోవడంతో మొత్తానికి ఈ సారి ఇండియన్ సినిమాకి ఆస్కార్ రాలేదు.
Also Read:Teeth Pain:పంటి నొప్పికి ఇంటి వైద్యం