ఈ పండ్ల రసాలు తాగితే.. ఎంత మేలో !

7
- Advertisement -

నేటి రోజుల్లో బరువు తగ్గడం చాలమందికి అతిపెద్ద సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన, ఎలాంటి మెడిసిన్ వాడిన కొంతమంది బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. అయితే నిపుణుల సలహా మేరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తూనే కొన్ని రకాల జ్యూస్ లు తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఊందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ వంటివి బరువును తగ్గించడంలో సహాయ పడతాయట. ఈ మూడింట్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా కరిగించడంలో దోహద పడతాయి.

లెమన్ జ్యూస్ మరియు ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీరంలోని ఉత్తేజాన్ని ప్రేరేపించి ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా వ్యాయామంపై ఇంట్రెస్ట్ లేని వారు సైతం ఆసక్తి చూపిస్తారని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే గ్రేప్స్ జ్యూస్ తాగడం వల్ల ఆకలి మందగిస్తుంది, తద్వారా బరువు వేగంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపించడంలో కూడా ఈ జ్యూస్ లు సహాయ పడతాయి. కాబట్టి వ్యాయామం చేసేటప్పుడు పైన చెప్పిన జ్యూస్ లను సేవించడం మంచిది. కొంతమంది ప్రోటీన్ పౌడర్ వంటివి జ్యూస్ రూపంలో తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాటి కంటే కూడా లెమన్, ఆరెంజ్, గ్రేప్స్ వంటి పండ్ల రసాలను సేవించడం ద్వారా వేగంగా బరువు తగ్గడంతో పాటు రోజంతా ఎంతో ఉత్సాహనిస్తాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:విక్రమ్.. “తంగలాన్”

- Advertisement -