విపక్షాల మూకుమ్మడి ప్లాన్ !

52
- Advertisement -

మోడి సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు ఎప్పటి నుంచో పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. మోడి సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఏ చిన్న అవకాశం దొరికిన వదలడం లేదు విపక్ష పార్టీలు. తాజాగా పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంపై మోడి సర్కార్ ను ఇరకాటంలో పడేసేందుకు విపక్ష పార్టీలు వ్యూహరచన చేశాయి. ఈ నెల 28న పార్లమెంట్ సెంట్రల్ విస్టా ను ప్రారంభించనుంది మోడి సర్కార్. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడి చేతుల మీదుగా జరిగించాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది..

అయితే ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యంగ బద్దమైన పార్లమెంట్ ను రాజ్యంగ అధిపతిగా భావించే రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం జరిగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా కాకుండా మోడి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది రాజ్యంగ విరుద్దమే అవుతుందని విపక్షాలు చెబుతున్నామాట. అందుకే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు దాదాపు 19 విపక్ష పార్టీలు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, జెఏంఏం, సమాజ్ వాది పార్టీ, జేడీయూ, ఆర్జేడి.. వంటి పార్టీలు ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి.

Also Read:IPL 2023 : ఫైనల్ కు వెళ్ళేదేవరు..?

ఒకవేళ రాష్ట్రపతిచే కాకుండా ప్రధాని మోడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. మోడి రాజ్యంగ విరుద్దంగా వ్యవహరించరానే విమర్శను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు విపక్షాలు ప్లాన్ చేశాయి. అయితే ప్రభుత్వ బీజేపీ నేతలు మాత్రం మోడి ప్రారంభించడాన్ని సమర్తిస్తున్నాయి. గతంలో ఇందిరా గాంధీ, పార్లమెంట్ అనుబంధ భవనాన్ని, రాహుల్ గాంధీ పార్లమెంట్ గ్రంథాలయాన్ని ప్రారంభించారని, అందువల్ల ఇప్పుడు ప్రధాని మోడి పార్లమెంట్ సెంట్రల్ విస్టా ను ప్రారంభించడంలో తప్పేముందని చెబుతోంది మోడి సర్కార్. మరి వ్యవహారంపై మోడి సర్కార్ ను ఇరకాటంలో పెట్టేందుకు చూస్తున్న విపక్షాల ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

- Advertisement -