- Advertisement -
పెగాసస్ వ్యవహారం, పెట్రో ధరలు, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌కు సైకిల్ ర్యాలీ చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చిన రాహుల్..కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని నిర్ణయించారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్, తృణమూల్ కాంగ్రెస్, లోకతాంత్రిక్ జనతాదళ్ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరు కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వరం వినిపిస్తే, మన స్వరం అంత బలంగా మారుతుందని తెలిపారు.
- Advertisement -