భారత హాకీ..మిగిలింది కాంస్య పోరే!

65
hockey

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీ ఫైనల్లో భారత జట్టు ఓటమి పాలైంది. బెల్జియం చేతిలో 5-2 గోల్స్ తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. అయితే సెమీస్‌లో ఓడినా కాంస్యం కోసం రెండ‌వ సెమీస్‌లో ఓడిన జ‌ట్టుతో భారత్ తలపడనుంది. ఆగస్టు 5న ఈ మ్యాచ్ జరగనుంది.

మ్యాచ్ ప్రారంభం ఫస్ట్ క్వార్టర్‌లో బెల్జియంపై భారత్ పైచేయి సాధించింది. ఫ‌స్ట్ హాఫ్‌లో మ‌న్‌దీప్ సింగ్‌, హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌లు ఇండియాకు గోల్స్ చేశారు. అయితే బెల్జియం ఆట‌గాడు అలెగ్జాండ‌ర్ హెండ్రిక్స్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. రెండ‌వ, మూడ‌వ‌ క్వార్ట‌ర్‌లో ఇరు జ‌ట్లు గ‌ట్టిగా పోరాడాయి. నాలుగ‌వ క్వార్ట‌ర్‌లో బెల్జియం ఏకంగా మూడు గోల్స్ చేసి విజయబావుటా ఎగురవేసింది.

సెమీస్‌లో ఓడినా భార‌త జ‌ట్టు ప‌ట్ల‌, ఆటగాళ్ల నైపుణ్యం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. గెలుపు ఓట‌ములు జీవితంలో భాగం అని… హాకీ జ‌ట్టు అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింద‌ని, అదే చాలా కీల‌క‌మైంద‌ని, త‌ర్వాత మ్యాచ్‌లో ఉత్త‌మంగా రాణించాల‌ని ఆశిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు.