చమురు సంక్షోభం..ఎంపీల నిరసన

6
- Advertisement -

దేశంలో ఎల్పీజీ (వంటగ్యాస్) సరఫరా సమస్యపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఆరోపిస్తూ, ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తారు.

ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు ఎల్పీజీ కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సుగత రాయ్ మాట్లాడుతూ…ప్రభుత్వం ఎల్పీజీ సంక్షోభాన్ని సరిగా నిర్వహించలేకపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు.

అదేవిధంగా సంజయ్ రౌత్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అంతర్జాతీయ పరిస్థితులపై భారతదేశం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని సూచించారు. ప్రమోద్ తివారి మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఉంది. నగరాలు, గ్రామాల్లో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఈ అంశంపై మేము నిరసన చేపడుతున్నాం అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, హార్ముజ్ జలసంధి మార్గంలో వ్యాపార రవాణా అంతరాయం కలగడం వల్ల గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై ప్రభావం పడినట్లు సమాచారం. అయితే ఇటీవల భారతదేశానికి చెందిన ఎల్పీజీ నౌకలు సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి, త్వరలోనే దేశానికి చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రతిపక్షం నిరసనలు కొనసాగిస్తుండగా, ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

- Advertisement -