ఎన్నికల్లో పోటీకి కమల్ దూరం!

9
- Advertisement -

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ స్థాపించిన Makkal Needhi Maiam (ఎంఎన్‌ఎం) పార్టీ ఈసారి ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకూడదని నిర్ణయించింది. అయితే డీఎంకే నేతృత్వంలోని కూటమికి కమల్ మద్దతు ప్రకటించారు.

డీఎంకే కూటమి సీట్ల పంపిణీపై చర్చలు పూర్తవుతున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. ఎంఎన్‌ఎంకు కేటాయించిన సీట్ల సంఖ్య, అలాగే డీఎంకే ‘రైజింగ్ సన్’ గుర్తుతో పోటీ చేయాలన్న ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమల్ హాసన్, ఆ షరతులు తమకు ఆమోదయోగ్యం కావని తెలిపారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాకు ఇచ్చిన సీట్లు, అలాగే డీఎంకే గుర్తుతో పోటీ చేయాలన్న సూచన మా పార్టీకి అంగీకారయోగ్యం కాదు. అందుకే ఈసారి ఎన్నికల్లో నేరుగా పోటీ చేయడం లేదు అని కమల్ హాసన్ వెల్లడించారు. అయితే, డీఎంకే కూటమి అభ్యర్థులకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల భావోద్వేగాలు, విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందిస్తూ….కమల్ హాసన్ తనను వ్యక్తిగతంగా కలసి ఈ విషయాన్ని తెలియజేశారని చెప్పారు. ఇది త్యాగం కాదని ఆయన చెప్పినా, నిజానికి ఇది గొప్ప త్యాగమే అని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం వ్యక్తం చేసిన కమల్ హాసన్, త్వరలోనే స్టాలిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కలుసుకుని అభినందిస్తానని పేర్కొన్నారు.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

డీఎంకే కూటమిలో కాంగ్రెస్– 28 సీట్లు,వీసీకే – 8 సీట్లు, డీఎండీకే – 10 సీట్లు, సీపీఐ ,సీపీఎం – తలా 5 సీట్లలో పోటీచేయనున్నారు. అలాగే ఎండీఎంకే – 4 సీట్లు,ఇండియన్ ముస్లిం లీగ్, Manithaneya Makkal Katchi తలా 2 సీట్లలో, Kongunadu Makkal Desia Katchi – 2 సీట్లలో పోటీ చేయనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు.

- Advertisement -