ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వనపర్తి వెంకటయ్య నిర్మిస్తోన్న చిత్రం ఊరికి ఉత్తరాన
. నరేన్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో దీపాలి శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. వరంగల్‌లో జరిగిన ఓ యథార్థ సంఘటనకు ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 19న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత వనపర్తి వెంకటయ్య మాట్లాడుతూ.. మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన మా చిత్రంలోని రెండు పాటలకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలకు, టీజర్‌కు మంచి వ్యూస్ వచ్చాయి. మిగతా పాటలు, ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి,అంకిత్ కొయ్య, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ అరుపుల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి, సాహిత్యం: సురేష్ గంగుల, పూర్ణాచారి, పీఆర్వో: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాల్యా కందుకూరి, కో-ప్రొడ్యూసర్: రాచాల యుగంధర్, నిర్మాత: వనపర్తి వెంకటయ్య, దర్శకత్వం: సతీష్ అండ్ టీమ్.