ఈ నెల 19తో రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ గడువు ముగియనుండటంతో మరిన్ని సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీ తరహా అన్‌లాక్‌కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నెల 19 తర్వాత నైట్ కర్ఫ్యూ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇక జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‌లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ 20వ తేదీ నుంచి సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పొడగించనుండగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్ సడలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు.