రాష్ట్రంలో 9కి చేరిన ఒమిక్రాన్ కేసులు:డీహెచ్‌ శ్రీనివాసరావు

160
srinivasarao
- Advertisement -

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 8కి చేరాయన్నారు డిహెచ్ శ్రీనివాస రావు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి వరకు సామాజిక వ్యాప్తి జరగలేదన్నారు. డిసెంబర్ 1 నుంచి ఎయిర్పోర్ట్ సర్వేలేన్స్ లో 10 ఎట్ రోస్క్ దేశాల స్క్రీనింగ్ లో 2 ఒమిక్రాన్ కేసుల గుర్తింపు జరిగిందన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి 7 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందన్నారు.

చెక్ రిపబ్లిక్, సూడాన్, యూకే , కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ గుర్తించామన్నారు. వరంగల్ కి చెందిన మహిళ కి 8 రోజుల తరువాత కోవిడ్ పాజిటివ్ గ గా నిర్ధారణ అయిందన్నారు. 90 దేశాలకు ఒమిక్రాన్ వ్యాప్తి జరిగిందని.. 95% కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదన్నారు. ఇప్పటివరకు యూకే లో ఒక్క మరణం మినహా ఒమిక్రాన్ మరణాలు నమోదు కాలేదన్నారు.

ఒమిక్రాన్ తో ప్రాణాలకు ప్రమాదం లేదని…ఆక్సిజన్ తీసుకోకపోవడం సైతం ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం అవుతుందన్నారు. 8 ఒమిక్రాన్ బాధితులకు సంబంధించి…. 21 మంది కాంటాక్ట్ ట్రెసింగ్ చేశామన్నారు. వైద్య సిబ్బందికి సహకరించని వారి విషయంలో పోలీస్ శాఖ సహాయం తీసుకుంటామన్నారు. అబుదాబి, దుబాయ్, సూడాన్ ల నుంచి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు.

- Advertisement -