కరీంనగర్‌లో ఆశావర్కర్ల పాదయాత్ర..

23
aasha workers

రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టార్చ్ నుంచి కలెక్టరేట్ వరకు నాలుగు కిలోమీటర్లు ఆశా వర్కర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లా అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలని ఇంతవరకూ ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆశా వర్కర్లకు పిఆర్సి 30 శాతం వరకు చెల్లిస్తామని స్వయంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించిన గత సంవత్సరం డిసెంబర్ లో వేస్తానని చెప్పిన పిఆర్సి వేయలేదని పారితోషకం వేతనాన్ని రద్దుచేసి ఆశా వర్కర్లకు పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని ఆశ వర్కర్లతో 24 గంటలు పని చేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశావర్కర్ల తో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు