బీజేపీ నేతలకు కన్నింగ్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. పనిగట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై బూతు పదజాలంతో దుష్ప్రచారం చేయడం లేదా..డైలీ ఏదో ఒక ఇష్యూపై రచ్చ చేసి అగ్గిరాజేసి ఆ మంటలలో చలికాచుకోవడం…తమను తామే గాయపర్చుకుని సింపతీ డ్రామాలు ఆడడంలో తెలంగాణ బీజేపీ నేతల తర్వాత ఎవరైనా. ఇక ముఖ్యంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు పాకిస్థాన్, పాతబస్తీ అంటూ సొల్లు కబుర్లు చెబుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటారు.
Also Read:ఘనంగా సచివాలయ ప్రారంభ వేడుకలు..
ముఖ్యంగా మతాల మధ్య చిచ్చుపెట్టడంలో కాషాయ నేతల తర్వాతే ఎవరైనా. ఇక ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన దగ్గరి నుండి ఇది మరి పెరిగిపోయింది. ఎలాగైన రాజకీయ లబ్ది పొందేందుకు నోటికి వచ్చినట్లు మాట్లాడటం తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. కొన్నిసార్లు బండి ప్రయత్నాలు ఫలించినా మెజార్టీ సందర్భాల్లో బొక్క బొర్లా పడ్డారు. ఇప్పటికి సోషల్ మీడియాలో తంబాకు బండి ట్రెండింగ్లో ఉన్నారంటే ఆయన నోటిదురుసు ఎంతో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇటీవలె బండి సంజయ్ చేసిన కామెంట్స్. పాతబస్తీలో ముస్లింలు విద్యుత్ బిల్లులు కట్టరు. దీనిని సోషల్ మీడియాలో వైరల్గా చేశారు. అయితే కొంతమంది బండి మాటలు నమ్మి వాస్తవాలు తెలుసుకోకుండా ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం హైదరాబాద్ పాత బస్తీలో 99% విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయి. ఇది రాష్ట్ర సగటు వసూలు కన్నా ఎక్కువే. దీంతో నిజం తెలుసుకున్న కొంతమంది బండిని తూర్పార బడుతున్నారు. మతాల పేరుతో ఇలా పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులకు ప్రజలు బుద్దిచెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:IPL 2023:బెంగళూరు తో కోల్ కతా.. ఢీ!