వంట నూనె ధరలు తగ్గింపు?

113
oil
- Advertisement -

సామాన్యులకు స్వల్ప ఊరట. వంట నూనె ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. ది. లీటరుకు రూ. 12 వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వంట నూనె తయారీ కంపెనీలు ఎడిబుల్ ఆయిల్ రేటును మరింత తగ్గించడానికి అంగీకారం తెలిపాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు తగ్గిన నేపథ్యంలో వంట నూనె ధరలు లీటరుకు రూ. 10 నుంచి రూ. 12 వరకు తగ్గనున్నాయని చెప్పారు. వంట నూనెలను ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు పెరిగితే ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి నమ దేశానికి వంట నూనె దిగుమతులు తగ్గాయి. దీంతో రేట్లు ఆకాశాన్నంటాయి.

- Advertisement -