శ్రీవారి సన్నిధిలో దిల్ రాజు..

68
dil
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నిర్మాత దిల్ రాజు. భార్య తేజస్విని, కొడుకుతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఇక తొలిసారి కొడుకుతో కలిసి తిరుమల వెళ్లిన దిల్ రాజు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఆ తర్వాత దిల్ రాజు కూతురి ఒత్తిడితో కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.

ఇటీవలే 2022 జూన్ 29న దిల్ రాజు భార్య తేజస్విని పండంటి బాబుకి జన్మనిచ్చింది.

- Advertisement -