ఢిల్లీలో నేటి నుంచి సరి – బేసి విధానం అమలు

320
oddevenrule
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్ధాయికి చేరిన సంగతి తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా మరోసారి నేటి నుంచి సరి- బేసి విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఆప్ సర్కార్. నేటి నుంచి నవంబర్ 15 వరకు సరి-భేసీ విధానం అమలులో ఉండనుంది. ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఈ సరి-భేసీ విధానం అమలులో ఉండనుంది. ఈ నిబంధన ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండనుంది. ఇవాళ సరి సంఖ్యల వాహనాలనే అనుమతిస్తారు.

సరి – బేసి విధానాన్ని ఉల్లంఘిస్తే రూ. 4 వేలు జరిమానా విధించనున్నారు. ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన వర్తించదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్లకు, ఛీఫ్ జస్టిస్,లోక్ సభ స్పీకర్, కేంద్రమంత్రులు, రాష్టాల ముఖ్యమంత్రులకు, లోక్ సభ ,రాజ్యసభ ప్రతిపక్ష నాయకులకు సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలకు కూడా ఈ విధానం నుంచి వెసులుబాటు కల్పించారు.

- Advertisement -