“నువ్వు తోపు రా” అమెరికాలోని యూటా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రశంసల జల్లుతో “బెస్ట్ ఫిల్మ్” విన్నర్‌గా నిలిచింది. . “నువ్వు తోపు రా” మొదటి నుండి వినూత్నమైన పంథాని చూపించే ప్రయత్నం చేస్తుంది.మొట్ట మొదట తెలుగులో ‘ప్రూఫ్ అఫ్ కాన్సెప్ట్’ ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షిచింది. ఆ తరువాత విజయ్ దేవరకొండతో టీజర్ రిలీజ్ చేయించడం, ప్రభాస్తో టైలర్ రిలీజ్ చేయించడం, గీత డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా రిలీజ్ అవడం ఇలా అన్ని సినిమా కి హైప్ క్రియేట్ చేశాయి.
డిజిటల్ ప్లాట్ఫామ్ లో రిలీజ్ తరువాత హిట్ గా నిలిచింది. అటు అమెజాన్ లో, అల్లు అరవింద్ గారి ఓ టీ టీ అయినా “ఆహా వీడియో” లో ట్రెండింగ్ అయ్యి మోస్ట్ వాచేడ్ మూవీగా నిలిచింది. ఇటు యూట్యూబ్లో కూడా 2.5 మిలియన్ ప్లస్ వ్యూస్ తో పాజిటివ్ కామెంట్స్ తో రన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక అరుదైన అవార్డు తో మళ్ళి న్యూస్ లోకి వచ్చింది. 30% ఇండియాలో, 70% అమెరికాలోని యుటా స్టేట్ లో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి ఇండియన్ ఫిలిం “నువ్వు తోపు రా” అని మనకు తెలిసిన విషయమే . అయితే ఆ స్టేట్ లోని యూటా ఫిల్మ్ ఫెస్టివల్ లో “బెస్ట్ ఫీచర్ ఫిల్మ్” గా “మేడ్ ఇన్ యూటా-ఫీచర్” కేటగిరిలో నిలిచింది . కరోనా వలన ఈ సంవత్సరం ఏప్రిల్ 2020 లో జరిగాల్సిన ఫెస్టివల్ పోస్ట్ ఫోన్ అయ్యి .. నవంబర్ 19-21, 2020 వర్చువల్ గా జరిపారు.
వారెన్ వర్కుమాన్ ఫెస్టివల్ నిర్వాహకులు క్యూ అండ్ ఏ సెషన్ లో మాట్లాడుతూ “క్రిటికల్ గా వుండే జడ్జెస్ ఈ సినిమాని డైరెక్షన్ని, స్క్రీన్ ప్లే,సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని విభాగాలకు స్టార్ రేటింగ్ ఇచ్చారని తెలిపారు.ఈ అరుదైన అవార్డు తీసుకున్నా సందర్భంగా దర్శకులు హరినాథ్ బాబు మాట్లాడుతూ “సినిమాని ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాతలైన శ్రీకాంత్ గారిని, జేమ్స్ వాట్ కొమ్ము గారిని, రితేష్ కుమార్ గారిని తన జీవితంలో మరచిపోలేనని, వారి వలననే ఈ రోజు ఈ అవార్డు తీసుకో గలిగానని తెలిపారు. నిర్మాతలలో ఒకరైన జేమ్స్ వాటి కొమ్ము గారి వలన యూటా లో ఫిల్మింగ్ చేశామని వారి సహకారం వలన గీత డిస్ట్రిబ్యూషన్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ చేయగలిగామని, వారు సినిమాకి వెన్నెముక లాగ వున్నారని తెలిపారు. తన మొదటి సినిమాని అమెరికాలో చేయడానికి ప్రధాన కారణం హీరో సుధాకర్ గారు అని, అక్కడే అరుదైన అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని, వారికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన సినిమా కాస్ట్ అండ్ క్రూ ఇండియా మరియు అమెరికా వాళ్లకి, అమెరికాలో తనకు సహకారాన్ని అందించిన అమెరికన్స్ కి, తెలుగు కమ్యూనిటీ కి తన కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాతలలో ఒకరైన జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ “దర్శకుడు చాలా టాలెంటెడ్ మరియు సౌమ్యుడు. కాస్ట్ అండ్ క్రూ అటు ఇండియన్స్ తో ఇటు అమెరికన్స్ అందరితో తో మిళితమై పనిచేసేవాడని, ఈ అవార్డు కి తను హరుడని కొనియాడారు. అలాగే ఈ సినిమా హీరో సుధాకర్, హీరోయిన్ నిత్యా శెట్టి మరియు టీం అందరి సహకారంతో ఈ చిత్రం నిర్మించ గలిగామని వారి అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ అరుదైన అవార్డు తమ చిత్రానికి రావడానికి సప్పోర్ట్ చేసిన జడ్జెస్ కి, నిర్వాహకులు వారెన్ వర్కుమాన్ కి కృతజ్ఞతలు తెలిపారు. యూటా చాలా అందమైన ప్లేస్ అని దీనిని తెలుగు సినిమా ప్రపంచానికి పరిచయం చేయాలనే తపన కొంత తీరిందని, మరిన్ని చిత్రాలను ఈ యూటా లో నిర్మిస్తానని తెలిపారు. ఇక్కడి తెలుగు కమ్యూనిటీ,అమెరికన్ పీపుల్ సప్పోర్ట్ మరిచిపోలేనని, చాలామంది నిర్మాతలకి ఇక్కడ సినిమా తీయాలని ఉంటుందని కానీ, ఇలాంటి టీం వలన నాకు సులభంగా అయిందని తెలియజేశారు.
హీరో సుధాకర్ మాట్లాడుతూ “మా మిస్పెస్ జాబ్ రీత్యా అమెరికా రావడంతో, డైరెక్టర్ గారిని సినిమాని అమెరికాలో చేద్దాం అనడంతో ఈ స్క్రిప్ట్ ప్లాన్ చేసి చేయడం జరిగిందని, యూటా స్టేట్ లో చేయడం, ఆ స్టేట్ లో చిత్రీకరించిన అన్నిచిత్రాలు,అటు ఆంగ్ల, ఆంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి ఉత్తమ చిత్రంగా ఎంపిక అవ్వడం చాలా ఆనందం ఉందని. ఈ చిత్రం అమెరికాలో చేయడానికి కారణం నా మిస్సెస్ హారిక,ఈ క్రెడిట్ తనకి చెందుతుందని, ఈ చిత్రానికి సహకరించిన అందరికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ అవార్డు విన్నింగ్ సినిమా చూడని వాళ్ళు అమెజాన్ పైమ్ లో, ఆహా వీడియోలో, యూట్యూబ్ లో చూడండి. చూసినవాళ్లు మరోసారి చూడండి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారో తెలుస్తుందని డైరెక్టర్ హరినాథ్ బాబు తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.