హైదరాబాద్‌కు పైసా సాయం చేయని కేంద్రం: ఎంపీ నామా

246
nama
- Advertisement -

హైదరాబాద్‌కు కేంద్రం పైసా సాయం చేయలేదన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. తెలంగాణ భవన్‌లో ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడిన నామా నాగేశ్వర్‌రావు..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ను ఆశీర్వదించాలన్నారు. ఎన్నికల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు….కానీ వాస్తవాలు ఉండాలి …తెలంగాణ నుంచి బీజేపీ కి నలుగురు ఎంపీ లున్నారు
…పార్లమెంటులో మంత్రి కిషన్ రెడ్డి సహా బీజేపీ ఎంపీ లు ఎపుడైనా మాట్లాడారా ?..ఒక్క అక్షరం ముక్కైనా పార్లమెంటు లో తెలంగాణ హక్కుల గురించి మాట్లాడారా ?..మాట్లాడితే తెలంగాణ కు నిధులు తెచ్చామంటారు ..ఏం తెచ్చారు…టోల్ గేట్ సహా టాక్సుల రూపం లో తెలంగాణ నుంచి 3 లక్షల కోట్లు రూపాయలు తీసుకెళ్లారని మండిపడ్డారు.

ఈ డబ్బులో 30 శాతం కూడా తెలంగాణ కు తిరిగి ఇవ్వలేదు…కేంద్రమే తెలంగాణ కు బాకీ తప్ప మాకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్రమంత్రులు తెలంగాణ కు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు లెక్కలు చెప్పి ఓట్లు అడగాలి…ఎన్నికల్లో బీజేపీకి భయం లేక పోతే ఇంతమంది కేంద్ర మంత్రులు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రావడం దేనికని ప్రశ్నించారు.

హైదరాబాద్ గత ఆరేళ్లుగా సామరస్యం ఉంది..ఓక్క చిన్న సంఘటన కూడా జరగకుండా హైదరాబాద్ ను కాపాడుకున్నాం..ఈ సామరస్యం దెబ్బ తీయాలన్నది బీజేపీ వ్యూహం
…హైదరాబాద్ ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం…గుజరాత్ ,కర్ణాటక లో వరద సాయం చేసి కేంద్రం తెలంగాణ కు మొండి చేయి చూపింది…తెలంగాణ కు ఒక్క ప్రాజెక్టు నయినా బీజేపీ తెచ్చిందా ?…కనీసం నవోదయ విద్యాలయాలను కూడా తేని దుస్థితి బీజేపీ నేతలది…ఏమీ అడిగినా ఇవ్వని బీజేపీ కి ఓట్లెందుకు వేయాలని దుయ్యబట్టారు.కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు ఇవ్వరూ ?…ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలనికేంద్రం బేరం పెడుతోంది…న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా కేంద్రం ఇవ్వట్లేదు…అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలి …వస్తున్న కేంద్రమంత్రులు చెప్పే మాయ ,మోసపూరిత మాటలు ప్రజలు నమ్మొద్దు…హైదరాబాద్ కు 430 యేండ్ల చరిత్ర ఉంది…గత ఆరేండ్ల లో జరిగిన అభివృద్ధిని గతం లో జరిగిన అభివృద్ధి ని పోల్చుకోవాలి…పీఎం మోడీ కూడా హైదరాబాద్ కు ఇండైరెక్ట్ గా వస్తున్నారు …కోవిడ్ వ్యాక్సిన్ హైదరాబాద్ లో తయారవ్వడం గొప్ప..పీఎం మోడీ తన పర్యటన సందర్భంగా మాయ మాటలు చెప్పొద్దు..భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్ రావడం గొప్ప..ఎన్నికల స్టంట్ కోసం మోడీ రేపు హైదరాబాద్ నుంచి తెలంగాణ కు ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామంటారు…బీహార్ ఎన్నికలప్పుడు అక్కడ ఇలాగే చెప్పారు…మొత్తం దేశానికి వ్యాక్సిన్ ఫ్రీ అని పీఎం చెప్పొచ్చుగదా అన్నారు.

బీజేపీ మేనిఫెస్టో లో మెట్రో లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు..ఢిల్లీ లో ఆప్ ప్రభుత్వం మెట్రో లో ఫ్రీ ప్రయాణం అంటే కేంద్రం ,బీజేపీ నేతలు వ్యతిరేకించలేదా ?…మా మేనిఫెస్టో లో చేసేదే చెప్పాము…జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే టీ ఆర్ ఎస్ ను ఆశీర్వదించాలి..యువత బీజేపీ మోసాలను గమనించి టీ ఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వాలన్నారు.

- Advertisement -