సిద్ధార్థ్ మూవీ..రికార్డు బ్రేక్!

17
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.హిట్ సినిమాలన్ని రీ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధిస్తుండగా తాజాగా హీరో సిద్ధార్థ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీ రిలీజ్ అయింది. ప్రభుదేవా దర్శకత్వంలో 2005 లో విడుదలైన సినిమాకు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. సిద్ధార్థ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా ప్రేమించిన అమ్మాయి కోసం ఒక ధనవంతుల కొడుకైన కథానాయకుడు వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను మెప్పించడం ఈ చిత్ర కథాంశం.

అయితే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాలు నాలుగు లేదా ఐదు భాషల్లోనే వచ్చాయి. కానీ సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఏకంగా 9 భాషల్లో విడుదలైంది. దీంతో ఇప్పటివరకు అత్యధిక భాషల్లో రిమేక్ అయిన భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది.

కన్నడ,బెంగాలీ,మణిపురి,హిందీ,పంజాబీ,బంగ్లాదేశ్‌,నేపాలి,ఒడియా భాషల్లో రీమేక్ అయింది. ఈ సినిమా 5 నంది అవార్డులను గెలుచుకుని సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Also Read:IPL 2024 :చెన్నై బోణి.. ధోని రికార్డ్!

- Advertisement -