ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడగింపు..

22
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడగించింది ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు. మరో మూడు రోజుల పాటు కస్టడీని పొడగించింది. ఈ నెల 16న కవితను అరెస్ట్ చేయగా ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. ఇవాళ కవిత కస్టడీ ముగియడంతో మరో మూడు రోజులు పొడగించింది.

మరికొందరితో కలిపి కవితను ప్రశ్నించాల్సి ఉందని, ఐదు రోజులు కస్టడీ కావాలని ఈడీ అధికారులు కోరారు. అయితే న్యాయస్థానం మూడు రోజులు కస్టడీని పొడగించింది. బెయిల్ అప్లికేషన్ పై సమాధానానికి ఐదు రోజుల సమయం సరిపోతుందని తదుపరి విచారణ తేదీ లోపు ఇప్పుడే నోటీసులు ఇవ్వాలని కవిత న్యాయవాది కోరారు.

ఈనెల 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు కవితను కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఈడీని ఆదేశించింది. కస్టడీ పొడిగింపు తరువాత ఈడీ ఆఫీస్ కు కవితను తరలించారు. తన అరెస్టు రాజకీయ కుట్ర అని, ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్టు కక్ష సాధింపే అని కవిత చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం

- Advertisement -