జాజికాయ వారు తింటే ప్రమాదమా ?

14
- Advertisement -

జాజికాయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో అత్యంత విరివిగా ఉపయోగిస్తారు. ఎన్నో రకాల రోగాలను, వ్యాధులను నివారించడంలో ఇది దివ్య ఔషధంలా పని చేస్తుంది. కేవలం ఆయుర్వేదంలో మాత్రమే కాకుండా వంటల తయారీలో కూడా మసాలా దినుసుల వలె దీనిని ఉపయోగిస్తారు. దీనిలో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఏ, బి, సి తో పాటు మొదలగున సూక్ష్మ పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. అందుకే జాజికాయకు ఆయుర్వేదంలో అధిక ప్రాముఖ్యత ఉంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాల కారణంగా అజీర్తి, ఉబ్బరం, వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా వేసవిలో వచ్చే శరీర మంట మూత్ర మంట వంటి సమస్యలను కూడా; జాజిపొడి తగ్గిస్తుంది.ఈ జాజికాయను పొడి రూపంలో పాలలో కలిపి ప్రతిరోజూ ఉదయం పడగడుపున సేవిస్తే కండర బలం పెరుగుతుంది. .

ఇంకా పురుషుల్లో వీర్య వృద్దిని పెంచడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. జాజికాయలో మిరిస్టీస్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడడంలో సహాయ పడుతుంది. ఇంకా ఆర్థరైటిస్,. అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇలా జాజికాయ వల్ల కలిగే ఉపయోగాలు అనేకం. అయితే జాజికాయను అందరూ తీసుకోవచ్చా ? అంటే గర్భిణీలు ఏ మాత్రం తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాజికాయలో ఉండే మూలకాలు గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. దీనిని గర్భిణీలు తిన్నప్పుడు గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే పరిమితి మేర తీసుకోవడం మంచిదే. కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడే పై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. కాబట్టి జాజికాయ విషయంలో గర్భిణీలు కొంత జాగ్రత్త వహించడం మంచిది.

Also Read:OTT:ఈవారం చిత్రాలివే

- Advertisement -