చక్కెర అతిగా తింటే.. ప్రమాదమే!

21
- Advertisement -

చాలామంది స్వీట్స్ కు విపరీతంగా అలవాటు పడి ఉంటారు. అందువల్ల నిత్యం ఏదో ఒక రూపంలో తీపి పదార్థాలను తింటూనే ఉంటారు. తీపి తినడం ఆరోగ్యానికి ప్రమాదం అని తెలిసినప్పటికి ఆ అలవాటును మార్చుకోలేక అనారోగ్యం బారిన పడుతుంటారు చాలమంది. అందుకే ఆరోగ్యాన్ని దెబ్బతీసే వీటిలో తీపి ముందు వరుసలో ఉంటుందని వైద్యులు తరచూ హెచ్చరిస్తుంటారు. స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఇతరత్రా తీపి పదార్థాలలో తియ్యదనం కోసం ఎక్కువగా చక్కెరను ఉపయోగిస్తారు. అయితే చక్కెర ఉండే పదార్థాలను అతిగా తింటే కిడ్నీలలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉందని. ఇటీవల పరిశోదనల్లో బయట పడింది. రోజు వారి కేలరీల్లో 25 శాతం కంటే ఎక్కువగా తీపి పదార్థాలు తినే వారిలో దాదాపు 90 శాతం కిడ్నీలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. .

అంతే కాకుండా చక్కెర ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ బారిన పడే అవకాశాలు అధికం. అనేక దీర్ఘకాలిక రోగాలకు డయాబెటిస్ అనేది మార్గదర్శకంగా ఉంటుంది. ముఖ్యంగా టాప్ 2 డయాబెటిస్ త్వరగా ఎటాక్ అవుతుంది. దీని బారిన పడిన వారిలో అధిక దాహం, అధిక మూత్రవిసర్జన, అలసట, దృష్టిలోపం ఇలా చాలా సమస్యలే ఉత్పన్నమవుతాయి. ఇంకా ఆకలి మందగించడం, కిడ్నీల ఇన్ఫెక్షన్లు కూడా ఏర్పడతాయి. కాబట్టి డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంకా షుగర్ కలిగిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలన్నీకి మూల కారణమైన షుగర్ ( తీపి పదార్థాలు ) కు వీలైనంతా దూరంగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ స్థానంలో బెల్లం తగినంత ఉపయోగించడం మంచిది.

Also Read:OTT:ఈవారం చిత్రాలివే

- Advertisement -