కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ నలుమూలల వ్యాపిస్తుంది. ఇందులో భాగంగా కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజింగ్ ను స్వీకరించిన నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ రోజు ఆయన నిజామాబాద్ లోని సుభాష్ నగర్ కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మరో నలుగురికి ఈ గ్రీన్ సవాల్ విసరడం జరిగింది.
తెలంగాణ జాగృతి ముంబై ప్రెసిడెంట్ శ్రీనివాస్‌కి, ట్రస్మా అధ్యక్షుడు జయసింహ గౌడ్‌కి, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ జలంధర్ రెడ్డికి, జాగృతి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భరద్వాజ్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు ప్రభాకర్ రెడ్డి.
ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో నూడా అడ్వైజర్ కమిటీ మెంబర్స్ శ్రీహరి, అక్తర్, ఎక్స్ కార్పొరేటర్ విశాలినీ రెడ్డి, కాలనీ వాసులు రమ్య , రజిని, తులసి, లతా, శశికళ, రాజేశ్వరి, కవిత, గీత, విజయ ,శ్రీదేవి, పద్మ, స్వప్న ,నికిత, రేఖ, స్పందన, తదితరులు పాల్గొన్నారు.
NUDA Chairman Prabhakar Reddy Accepted Green Challenge By MP Santosh Kumar, He Planted Three Saplings..