మహేశ్ వద్దనుకున్నాడు…ఎన్టీఆర్ కావాలన్నాడు

424
Ntr Mahesh Babu
- Advertisement -

మహర్షి లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు. ఈసినిమాకు సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది. ఇక ఈమూవీ తర్వాత మహేశ్ ఏ దర్శకుడితో పనిచేస్తాడని ఆసక్తి నెలకొంది. క్యూ లో చాలా మంది దర్శకులే ఉన్నా ఇంకా ఎవరికి గ్రీస్ సిగ్నల్ ఇవ్వలేదు మహేశ్.

ఇక మహేశ్ కు తాజాగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక స్టోరీని వినిపించాడట. మహేశ్ తన నిర్ణయం చెప్పకపోవడంతో అదే కథను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడట దర్శకుడు ప్రశాంత్. దీంతో పూర్తీ స్క్రీప్ట్ ను రెడీ చేయమని చెప్పాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈమూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన యష్ హీరోగా కేజీఎఫ్‌ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -