ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ గెలిచేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్కార్ 2023లో ‘ఉత్తమ నటుడు’ అవార్డులో ‘RRR’ సినిమాకు గానూ జూ.ఎన్టీఆర్ ముందంజలో ఉన్నట్లు అమెరికన్ మ్యాగజైన్ రాసుకొచ్చింది. జనవరి 24న ప్రకటించే అకాడమీ అవార్డుల నామినేషన్లలో జూ.ఎన్టీఆర్ పేరు ఉండబోతుందని అంచనా వేసింది. నిజంగా ఎన్టీఆర్ కు ఆస్కార్ వస్తే అది అద్భుతమే. ఇప్పుడున్న అంచనాలను బట్టి తారక్ కి ఆస్కార్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఒకవేళ ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తే.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్‌కు నామినేట్ చేయని విషయం తెలిసిందే. ఈ విషయంపై సౌత్ ఇండియాలో చాలా విమర్శలు వచ్చాయి. ఓ దశలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెలివేయాలని కూడా మనవాళ్ళు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో ఇంతవరకూ పెదవి విప్పని రాజమౌళి కూడా తొలిసారి స్పందించారు.
భారత్ తరపున ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధికారికంగా ఆస్కార్‌కు నామినేట్ చేయకపోవడంతో చాలా బాధపడ్డానని.. కొంత నిరాశపడ్డానని కూడా చెప్పారు. అందరూ ఆశించిన విధంగా ఆస్కార్ కు నామినేట్ చేసి ఉంటే బాగుండేదని తెలిపారు. ఒక్క రాజమౌళి మాత్రమే కాదు, సౌత్ ఇండియా నుంచి ప్రతి ఒక్కరూ ఇదే కోరుకున్నారు. కానీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ విషయంలో చిన్న చూపు చూసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తే.. ముందుగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులకు మూడినట్టే. ముఖ్యంగా వారి పదవులకు కాలం చెల్లినట్టే.
ఇవి కూడా చదవండి…