ఎన్టీఆర్ హీరోయిన్ కి కూడా ఇవ్వాలట!

42
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ నటనకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే, ఇర్రెస్పెక్టివ్‌ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ ఇష్టమే! ఫ్యాన్స్, నాన్ ఫ్యాన్స్‌ అనే తేడా లేకుండా అందరూ ఎన్టీఆర్ నటన పై లవ్‌ అండ్‌ ఎఫెక్షన్ చూపిస్తారు. ఇప్పుడు ఆ ప్రేమకు పరిధులు లేవు. అవును, ఎన్టీఆర్‌కు హెచ్‌సీఏ (HCA) అవార్డు పంపనుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు.

ఇటీవలే లాస్ ఏంజిల్స్‌లో హెచ్‌సీఏ అవార్డ్స్ వేడుకలో 5 కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో రామ్ చరణ్ హాజరై అవార్డ్ అందుకోగా, ఎన్టీఆర్ రాలేదు. దీంతో అవార్డ్ ఒక్కరికే వచ్చినట్లుగా ఫ్యాన్స్ రచ్చ చేయడంతో హెచ్‌సీఏ ఎన్టీఆర్ కు వచ్చేవారం అవార్డు పంపనున్నట్లుగా ట్విట్ చేసింది. ఇది కచ్చితంగా ఎన్టీఆర్ నటనకు దక్కిన గౌరవం. అన్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో పక్కన నటించిన హీరోయిన్ కి కూడా అవార్డు రావాల్సిందే అని పట్టుబట్టారు.

చరణ్ హీరోయిన్ అలియాభట్ కు కూడా HCA అవార్డ్స్ ను అందిస్తున్నట్లు తెలిపారు. అందరికి అవార్డులు రావడం సంతోషంగానే ఉంది కానీ..మా హీరో సరసన జెన్నీ పాత్రలో నటించిన ఒలీవియా మోరిస్ కు కూడా అవార్డు ఇస్తే బాగుండు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. ఒలీవియా ప్రతిభకు అవార్డు ఇస్తే సంతోషిస్తాం అని నెటిజన్స్ కూడా చెప్పుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

మార్చి8..చమ్కీల అంగీలేసి సాంగ్‌

ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

పఠాన్ బంపరాఫర్.. రిజల్ట్ ఎలా ఉంటుందో?

- Advertisement -