నేడే డబ్ల్యూపీఎల్‌..జట్ల సభ్యులు వీరే..!

18
- Advertisement -

క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ నేడు ప్రారంభమవుతుంది. నవీ ముంబై వేదికగా జరుగుతున్న ఈసీజన్‌లో ఐదు జట్లు తలపడనున్నాయి. ముంబైలోని డీవైపాటీల్ స్టేడియం, బ్రబౌర్న్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. మహిళా ప్రీమియర్ లీగ్ వేడుక మార్చి4న ప్రారంభంకాగా..మార్చి 26న ముగుస్తాయి.

మొత్తం 20లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగ్గా..23రోజుల పాటు క్రికెట్‌ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. శనివారం సాయంత్రం 5.30గంటలకు మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగుతుంది. రాత్రి 7.30గంటలకు తొలి మ్యాచ్‌ గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబాయి ఇండియన్స్‌ మధ్య డీవై పాటీల్ స్టేడియంలో మొదటి మ్యాచ్‌ జరగనుంది.

సీజన్ ఆరంభ వేడుకలకు బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ కృతిసనన్ ప్రదర్శన ఇస్తారని బీసీసీఐ ప్రకటించింది. ర్యాపర్ ఏపీ థిల్లాన్ సీనియర్ సింగర్ శంకర్ మహాదేవన్ పాటలు పాడనున్నారు. మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌ ఛానెళ్లతో పాటు డిస్నీ+హాట్ స్టార్‌ ఓటీటీలో ప్రారంభ కానున్నట్టు ప్రకటించారు.

జట్ల సభ్యులు…

గుజరాత్ జెయింట్స్‌
బెత్ మూనీ (కెప్టెన్), ఆష్టే గార్డెనర్, జార్జియా వారెహమ్, స్నేహ రానా, అన్నాబెల్ సదర్లాండ్, డియాండ్రా డాటిన్, సోఫియా డంక్లీ, సుష్మా వర్మ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్, అశ్వని కుమారి, దయాలన్ హేమలత, మాన్సీ జోషి, మోనికా పటేల్, సబ్బినేని మేఘన, హర్లీ గాలా, పరుణికా సిసోడియా, షబ్నం షకీల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (కెప్టెన్), రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, రేణుకా సింగ్, సోఫీ డివైన్, హీథర్ నైట్, మేగాన్ షట్, కనికా అహుజా, డానే వాన్ నీకెర్క్, ఎరిన్ బర్న్స్, ప్రీతి బోస్,
కోమల్ జంజాద్, ఆశా శోభన, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, పూనమ్ ఖేమ్నార్, సహానా పవార్, శ్రేయాంక పాటిల్

ఢిల్లీ క్యాపిటల్స్‌
మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, మారిజాన్నె కాప్, ఆలిస్ క్యాప్సే, శిఖా పాండే, జెస్ జోనాసెన్, లారా హారిస్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మని, పూనమ్ యాదవ్, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సధు, జాసియా అక్తర్, అపర్ణ మోండల్, తారా నొరిస్

యూపీ వారియర్స్‌
అలిస్సా హీలీ (కెప్టెన్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, దేవికా వైద్య, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, గ్రేస్ హారిస్, అంజలి శర్వణి, రాజేశ్వరి గయక్వాడ్, శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, లారెన్ బెల్, లక్ష్మి యాదవ్, పార్షవి చోప్రా, ఎస్. యశశ్రీ, సిమ్రాన్ షేక్

ముంబై ఇండియన్స్‌
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నటాలీ స్కివర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, అమేలి కెర్, అమన్‌జోత్ కౌర్, హీలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, ప్రియాంక బాలా, ధారా గుజ్జర్, హుమైరా కాజీ, జింతిమని కలితా, నీలం బిష్ట్, సైకా ఇషాక్, సోనమ్ యాదవ్

ఇవి కూడా చదవండి…

రేపట్నుంచి మహిళల క్రికెట్ పోరు..!

మూడో టెస్టులో భారత్ ఓటమి..

వారికి మాత్రమే ఓపీఎస్..కేంద్రం ప్రకటన

- Advertisement -