ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది

41
- Advertisement -

జూ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘NTR30’ చిత్రానికి అనిరుధ్ అందించిన థీమ్ మ్యూజిక్ ప్రస్తుతం యావత్తు తెలుగు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది. తాజాగా అనిరుధ్ అమెరికా న్యూజెర్సీలో ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాడు. ఇందులో భాగంగా తన లేటెస్ట్ సినిమాలకు సంధించిన మ్యూజిక్ ను కూడా ప్లే చేశాడు. ఈ క్రమంలోనే NTR30 థీమ్ మ్యూజిక్‌ కూడా ప్లే అయ్యింది. మాస్ ఎలివేషన్ కి ఫుల్ కిక్ ఇచ్చే రేంజ్ లో NTR30 థీమ్ మ్యూజిక్ అదిరిపోయింది. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు ఊగిపోయారు. NTR30 థీమ్ మ్యూజిక్‌ సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. దాంతో ఈ థీమ్ మ్యూజిక్‌ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అనిరుధ్ కేవలం థీమ్ మ్యూజికే ఈ రేంజ్ లో ఇస్తే.. ఇక ఎన్టీఆర్30 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను ఏ రేంజ్ లో ఇస్తాడో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు ఈ సినిమా ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ లపై కొన్ని ప్రత్యేకమైన లవ్ షాట్స్ ను తీస్తున్నారు. ఈ షాట్స్ ఓ సాంగ్ లో భాగం అని తెలుస్తోంది. ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ ఫుల్ శారీలో కనిపిస్తోందట. అన్నట్టు హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు కంపోజ్ చేస్తున్నాడు.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది ఈ మూవీ. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. మరి ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు వచ్చిన క్రమంలో ఎన్టీఆర్ సినిమాలపై మరింత అంచనాలు పెరిగాయి. అందుకే ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఈ క్రమంలోనే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అలాగే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. ఈ సినిమాలో అందర్నీ నేషనల్ రేంజ్ ఆర్టిస్ట్ లనే తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

NBK 108:పాట కోసమే అంతా ఖర్చా!

Re-release:త్వరలో మోసగాళ్లకు మోసగాడు.!

సహజ నటనకు నీరాజనం

- Advertisement -