Dasara:నైజాంలో దసరా సంబరం.. కానీ,

44
Nani Dasara
- Advertisement -

నేచురల్ స్టార్ నానికి నైజాంలో మంచి పట్టు ఉంది. సహజంగానే నాని సినిమాలకు నైజాంలో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది నాని మొదటిసారి చేసిన పాన్ ఇండియా సినిమా దసరాకి ఇక ఏ రేంజ్ లో కలెక్షన్స్ రావాలి ?, దీనికితోడు దసరా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలు లేని చోట్లే భారీ స్థాయిలో కలెక్ట్ చేస్తుంటే.. మరి భారీ అంచనాలు ఉన్న నైజాం మాటేమిటి ? అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆ చర్చలో భాగంగా నిజమైన నైజాం కలెక్షన్స్ ను తెచ్చుకుని చూశారు.

మొత్తం నాలుగు రోజులకు నైజాంలో దసరా ఎన్ని కోట్లు రాబట్టిందో చూసి.. షాక్ అయ్యారు. నైజాంలో ఈ సినిమా ఇప్పటి వరకు మొత్తం 18.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పైగా 4వ రోజు కూడా మొత్తం రూ.3.95 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నాని సినిమాకి నాలుగో రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే.. కచ్చితంగా విశేషమే. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. సినిమాలో కీర్తి సురేష్ నటనకు కూడా చాలా మంచి పేరు వచ్చింది.

దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం కూడా చాలా బాగుంది అంటూ అతనికి విమర్శకుల సైతం నుంచి ప్రశంసలు లభించాయి. నేచురల్ స్టార్ నాని కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా దసరా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఐతే, ఈ సినిమా నిర్మాతకు లాభాలు రావాలి అంటే మాత్రం.. ఈ సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ చాలా కీలకం కానున్నాయి. ఈ సినిమాకి అసలు పరీక్ష ఈ రోజు నుంచే మొదలవుతుంది. మరి SLV సినిమాస్ కి ఎలాంటి రిజల్ట్ వస్తోందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది

సమంతను చూస్తే కన్నీళ్లొచ్చాయి – శోభితా

Raviteja:ఏప్రిల్‌7..రావణాసుర విడుదల

- Advertisement -