సహజ నటనకు నీరాజనం

53
- Advertisement -

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతుంది. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు రికార్డులు సృష్టించాయి. నాని కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలుస్తుంద‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సహజ నటనను ఇష్టపడే వారు నానికి అభిమానిగా మారిపోతారు. దసరా చిత్రం.. సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో, నాని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.

‘మీరు మా దసరా మూవీ పై చూపిస్తున్న ప్రేమకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, మీ ప్రేమ అంతా నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’ అంటూ ఆయన పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా నాని ట్విట్ట‌ర్‌లో అస‌లైన జెర్సీ మూమెంట్ ఫోటోను పోస్ట్ చేయ‌గా, అది కాస్త ప్రస్తుతం వైర‌ల్ అవుతుంది. జెర్సీ సినిమాలోని రైల్వే స్టేష‌న్ సీన్‌కు రెండు గొడ్డ‌ళ్లు యాడ్ చేశారు. మొత్తానికి ఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ‘దసరా’ కలెక్షన్స్ విషయానికి వస్తే… రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దసరా’కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా నైజాంలో ఫస్ట్ డే రూ.6.78 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు సుమారు రూ.25 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు రూ.38 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇవి కూడా చదవండి…

Shakunthalam:నా ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన ఇప్పుడు వదల్లేదు.!

Vikram:ఒకే స్టేజీపై విక్రమ్‌, రోలెక్స్‌..!

మా ఊరు పేరు భైరవకోన..సందీప్‌ కిషన్‌

- Advertisement -