NBK 108:పాట కోసమే అంతా ఖర్చా!

37
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలసి #NBK108 తో మాసెస్, అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇటీవలె బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్. బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు. మొదటి పోస్టర్‌ లో సాంప్రదాయ దుస్తులు ధరించి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ లో కనిపించారు బాలకృష్ణ. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా వుంది. బాలకృష్ణ చేతిపై టాటూ కూడా ఉంది. రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని గెటప్‌ లలో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో గణేశుడిపై సాగే పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 5 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అందులో బాలయ్య, శ్రీలీలపై పాటను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య కెరియర్‌లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతున్న పాట ఇదేనని చిత్ర యూనిట్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -