ఎన్టీఆర్ 29వ వర్ధంతి..ఘన నివాళి

0
- Advertisement -

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ  నందమూరి తారక రామారావు  స్వర్గీయులయి నేటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద రామారావు గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు, అభిమానులు ఫిలింనగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ను స్మరించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ… “నేను ఎన్టీఆర్ గారికి అభిమానిని మాత్రమే కాదు, పరమ భక్తుడిని కూడా. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం. ఆయనను నమ్ముకున్న వారిని ఎవరిని ఎన్టీఆర్ గారు వదులుకోలేదు. వారంతా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఎన్టీఆర్ గారు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఆయన చిత్రానికి మాటలు రాయడం నాదృష్టంగా భావిస్తున్నాను. అయిన ఇంటికి వెళ్తే కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు. ఆయన అభిమాని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు. మరోసారి అన్నగారు తెలుగు గడ్డమీద పుట్టాలి, మరోసారి తెలుగు వారి స్థాయిని పెంచాలి అని కోరుకుంటున్నాను” అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ… “దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈరోజు తెలుగువారి గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు. ఒకవైపు ఓ కదానాయకుడిగా ఆయన చేసిన పాత్రలు, అలాగే మరోవైపు ప్రజా నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పనులు అందరికి తెలిసినవే. అటువంటి మహానుభావుడికి భారతరత్న కచ్చితంగా ఇవ్వాలి. ఆ దిశగా మనం పోరాటం చేయాలి” అన్నారు.

ఎన్టీఆర్ మనవరాలు నందమూరి రూప మాట్లాడుతూ… “ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ నేను ఆలోచనలో ఉంటారు. ఆయన మరణం లేని వ్యక్తి. ఎన్నో సినిమాలలో బ్రహ్మాండమైన పాత్రలు పోషించిన ఆయన సినిమాలకు ఒక దృవతార. ఎన్నో దైవ పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ గారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోని ప్రభుత్వాన్ని స్థాపించిన వ్యక్తిగా నిలిచారు. ప్రజలకు అత్యవసరమైన కూడు, గుడ్డ, నీడను అందరికీ అందేలా చేశారు. ఆయనను ఒక నటుడిగా అలాగే రాజకీయ నాయకుడిగా కంటే కూడా ప్రజల శ్రేయస్సు కోరుకునే ఒక మహానుభావుడిగా ప్రజలు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు. అదేవిధంగా ఆడవారికి ఆస్తి హక్కులను కూడా సమానంగా ఉండేలా చేశారు. మా తాత గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Also Read:నా ఆస్తులు నాకు ఇప్పించండి:మోహన్ బాబు

ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ… “ఈరోజు నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికమైన మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ మాత్రం మన చుట్టూనే ఉంటుందని, సూర్య చంద్ర ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుంది. ఆయన సినీ రంగంలో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా పెను తుఫాను సృష్టిస్తూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆడవారికి ఆస్తి హక్కుల దగ్గర నుండి రెండు రూపాయలకు కిలో బియ్యం కొరకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి సత్తా చూపించారు. అది మనం అదృష్టంగా భావించాలి. ఎన్టీఆర్ గారు చేసిన సేవలను గుర్తించి ఆయనను భారతరత్నతో సత్కరించాలని విన్నపించుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ… “స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్లో ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారం. ఎన్టీఆర్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ గమనించదగిన వ్యక్తి. ఎన్టీఆర్ గారికి ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారు అప్పటినుండి ఆయనతో మా ప్రయాణం మొదలైంది. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని బాధ్యతగల పదవులు అప్పగించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన జరిగింది. నిన్ను చూపుతో హైదరాబాదును అభివృద్ధి చేసే ప్రతి పనిలోనూ ఆయన దగ్గర ఉండి అభివృద్ధి పనులు చూసుకునేవారు. ఆయన 35 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలను నేడు వేరే పేర్లతో దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -