రాశీని పక్కనపెట్టిన ఎన్టీఆర్

254
ntr
- Advertisement -

ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ దసరా కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తోన్న చిత్రమిది. తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరు తారక్’తో జతకట్టడం ఇదే తొలిసారి. లవ క్యారెక్టర్ సరసన రాశి ఖన్నా నటించింది. అతడితో కలిసి చక్కగా డాన్స్ చేసింది. ఎన్టీఆర్ కూడా రాశి యాక్టింగ్, డాన్సింగ్ చాలా బాగా చేసిందని మెచ్చుకున్నాడు. అయితే ఇంత మెచ్చుకున్న తారక్, ఒక విషయంలో మాత్రం రాశిని పక్కనపెట్టాడు.

Rashi-Khanna-

ఈ సినిమాలో తన గొంతుని వినిపించాలని.. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకొనేందుకు హీరోయిన్ రాశీఖన్నా ట్రై చేసినట్టు సమాచారమ్. ఈ ప్రపొజల్ ని దర్శకుడు బాబీ దాదాపు ఓకే చేశాడు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు. తారక్ మాత్రం నో చెప్పేశాడట. అనవసరమైన రిస్క్ తీసుకోవద్దనీ .. రాశి ఖన్నాకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే ఆర్టిస్ట్ తోనే చెప్పించమని ఎన్టీఆర్ సూచించాడ‌ట‌. దీంతో.. ‘జై లవ కుశ’ సొంత గొంతు వినిపించాలని ఆశపడ్డ రాశీ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది.

- Advertisement -