ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమా మళ్ళీ వస్తుంది

72
- Advertisement -

ఎన్టీఆర్ -పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఆంధ్రావాలా భారీ అంచనాలతో వచ్చి ప్రేక్షకులతో పాటు తారక్ ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరిచింది. ఈ సినిమా ఆడియో లాంచ్ నిమ్మకూరులో భారీ ఎత్తున నిర్వహించారు. అభిమానులు ఈవెంట్ కి చేరుకునేందుకు స్పెషల్ గా ట్రైన్స్ వేయడం అప్పట్లో సంచలనం. ఆడియో లాంచ్ తర్వాత అంచనాలు డబుల్ అయ్యాయి. అయితే సినిమా మాత్రం డిజాస్టర్ అనిపించుకుంది. కన్నడలో తీస్తే సూపర్ హిట్టయింది.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ‘ఆంధ్రావాలా’ ఎప్పటికీ మరచిపోలేని ఓ చేదు జ్ఞాపకంగా గుర్తుంటుంది. ఇప్పుడు ఆ డిజాస్టర్ సినిమాను రీ రీ రిలీజ్ చేస్తున్నాం అంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ రీ రీ రిలీజ్ చేయడానికి ఇదే దొరికిందా ? అంటూ పోస్టులు పెడుతున్నారు.

మొన్నీ మధ్యే ఎన్టీఆర్ నటించిన బాద్ షా రీ రిలీజ్ అయింది. పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. ఎన్టీఆర్ నటించిన ఆది, సింహాద్రి , యమదొంగ సినిమాలకు కాస్త క్రేజ్ ఉంటుంది కానీ మిగతా సినిమాలకు ఆ క్రేజ్ ఉండకపోవచ్చు. మరి ఆంధ్రావాలా కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -