చెర్రీతో మూవీ..కొత్త ఒరవడికి నాంది:ఎన్టీఆర్

221
ntr
- Advertisement -

అరవింద సమేత వీర రాఘవ నాలో మార్పు తెచ్చిందని చెప్పారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

త్రివిక్రమ్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. నేను పుస్తకాలు చదవను కానీ త్రివిక్రమ్ పుస్తకాల గురించి చెబుతూంటే వినాలనిస్తుందన్నారు. త్రివిక్రమ్ గొప్ప దర్శకుడని…నా దర్శకులందరినీ బాగా ప్రేమిస్తానని తెలిపారు.దర్శకుడిని సంతృప్తి పరిస్తే ప్రేకుడిని సంతృప్తి పరిచినట్లేనని తెలిపారు.

అరవింద సమేత తర్వాత వెంటనే చేయబోయేది రాజమౌళి సినిమానే అని తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఓ ఎగ్జైట్‌మెంట్ అని..‌. ఈ సినిమా ఓ కొత్త ఒరవడికి నాంది అనిపిస్తోందన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ కాదు. జస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం అలా ఇచ్చామని తెలిపారు. ఈ సినిమా తర్వాత అశ్వినీ దత్‌ బ్యానర్‌లో ఓ సినిమా
ఉందన్నారు.

నాలో సగం నా భార్య ప్రణతి అన్నారు. అమ్మ, నాన్న, కల్యాణ్‌ అన్న, కొంతమంది మిత్రులు వీళ్లంతా నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తులు… నా కోసం నిలబడేవాళ్లు…వాళ్ళతో చెప్పుకుంటాను. ఇప్పుడు నాన్నగారు లేరు ఆ వెలితి కనిపిస్తుందన్నారు.

జానకిరామ్, కల్యాణ్‌ రామ్, తారకరామ్‌ అని. మా పిల్లలకు కూడా మేం అలానే పెట్టాం. జానకిరామ్‌ అన్న కొడుక్కి తారక రామారావు అని, కల్యాణ్‌ అన్న శౌర్యా రామ్‌ అని పేర్లు పెట్టారు. నా పిల్లలకు అభయ్‌ రామ్, భార్గవ రామ్‌ అని నామకరణం చేశా. నాకు చాలా ఇష్టమైన పేరు భార్గవ రామ్‌ అని చెప్పారు.

- Advertisement -