కొరటాలతో చేస్తున్న నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ఇటీవల ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో చెప్పేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి లోనే ప్రారంభించి మార్చ్ నుండి షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారు. మేకింగ్ ఎక్కువ రోజులు లేకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు తారక్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ కాంబో పాన్ ఇండియా సినిమాను ఈ ఏడాది డిసెంబర్ నుండి షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ఇప్పటికే సలార్ షూటింగ్ తో పాటు NTR31 కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేస్తున్నాడట ప్రశాంత్ . భారీ ఖర్చుతో ప్రశాంత్ తారక్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ప్రశాంత్ , ఎన్టీఆర్ కి మంచి బాండింగ్ ఉంది.
కేజీఫ్ తర్వాత ప్రశాంత్ కి తారక్ కి మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది. ఆ టైమ్ లో మైత్రి సంస్థతో ప్రశాంత్ కి అడ్వాన్స్ ఇప్పించి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. ఈ కాంబో సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ప్రశాంత్ తారక్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి..