ఇందులో తప్పేం ఉంది ? – మృణాల్

47
- Advertisement -

హోమ్లీ లుక్స్ లో డీసెంట్ యాక్టింగ్ తో ‘సీతారామం’ సినిమాతో మృణాల్ ఠాకూర్ ప్రేక్షకులను ఫిదా చేసింది. మొత్తమ్మీద సింగిల్ సినిమాతో మృణాల్ ఠాకూర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది. అంత అద్భుతంగా ఆమె నటన ఆకట్టుకుంది. ఐతే, తనలో మంచి నటితో పాటు ఓ అల్లరి పిల్ల కూడా ఉందని.. ముఖ్యంగా సగటు ఆడపిల్ల ఉందని.. మృణాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కపిల్ శర్మ నిర్వహిస్తున్న షోలో మృణాల్ ఠాకూర్ గెస్ట్ గా పాల్గొంది.

కపిల్ శర్మతో ముచ్చట్లు సందర్భంగా.. తనకు కాబోయే భర్త అందంగా ఉండాలని మృణాల్ ఠాకూర్ మురిసిపోతూ చెప్పింది. దీంతో ఆమెపై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కి పిచ్చి ముదిరింది అని, ఆమె ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుందని, అసలు అందం ఏమైనా కొరుక్కుని తింటావా మృణాల్ ? అంటూ ఆమె పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. నెటిజన్ల ఓవర్ యాక్షన్ పై మృణాల్ ఠాకూర్ కూడా తీవ్రంగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ మెసేజ్ చేస్తూ.. ‘నాకు కాబోయే భర్త విషయంలో ప్రస్తుతం నా అభిప్రాయాన్ని నేను ధైర్యంగా చెప్పాను. ఇందులో తప్పేం ఉంది ?, నటీమణులు కూడా మనుషులే అన్న విషయాన్ని కొందరు ఎందుకు మర్చిపోతారు ?, బహుశా వారికి మేం మనుషుల్లా కనబడటం లేదు అనుకుంటా’ అని మృణాల్ ఠాకూర్ నెటిజన్స్ పై మండిపడింది. కాగా, గతంలో తన భర్త మంచి వాడైతే చాలని, అందం అవసరంలేదన్నారు

ఇవి కూడా చదవండి…

ఫిబ్రవరి18..రావణాసుర ప్యార్‌లోన పాగల్

వీక్ కలెక్షన్స్ తో ‘అమిగోస్’

మిస్టర్‌ కింగ్‌..అంతా చూడాల్సిన చిత్రం

- Advertisement -