‘ఎన్టీఆర్ 30’.. 29 నుంచి షూటింగ్!

21
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఈ నెల 23న ప్రారంభం కాబోతుంది. ఎట్టకేలకు ఎన్టీఆర్ షూటింగ్ కి రెడీ అయ్యాడు. సెట్స్‌లో తారక్ హడావిడీ చేయనున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. వరుస ఆటంకాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా తారకరత్న మరణంతో ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. కానీ, ప్రస్తుతం ఈ సినిమా టీమ్ షూట్ కి సన్నద్ధం అయ్యింది.

ఈ నెల 23న పూజా కార్యక్రమాలు చేసి.. మార్చి 29వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. అలాగే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ సినిమా షూట్ లో జాయిన్ కానుంది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని.. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నాడు.

పైగా ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు వచ్చిన క్రమంలో ఎన్టీఆర్ సినిమాలపై మరింత అంచనాలు పెరిగాయి. అందుకే ఈ సినిమాని అంతర్జాతీయ మూవీగా కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఈ క్రమంలోనే, నటీనటుల విషయంలో కొరటాల శివ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అలాగే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయ్యాడు. కాబట్టి.. ఈ సినిమాలో అందర్నీ నేషనల్ రేంజ్ ఆర్టిస్ట్ లనే తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

రాజమౌళి అందుకే పక్కన పెట్టారా ?

యో యో…రాక్‌స్టార్ మళ్లీ వస్తున్నాడు

రామ్ చరణ్ కోసం దర్శకుడి వెయిటింగ్

- Advertisement -