రామ్ చరణ్ కోసం దర్శకుడి వెయిటింగ్

31
- Advertisement -

RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ నెక్స్ట్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఎనౌన్స్ కూడా చేసేశాడు చెర్రీ. మొదటి సినిమా ‘ఉప్పెన’ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ వెంటనే ఎన్టీఆర్ కి ఓ కథ చెప్పేసి దాని మీద వర్క్ చేశాడు బుచ్చిబాబు. తీరా అది పనివ్వలేదు.

ఎన్టీఆర్ కి సెకండాఫ్ లో ఉన్న కంప్లైంట్ తో బుచ్చిబాబుకి నో చెప్పాడని టాక్ ఉంది. వెంటనే అదే కథ చరణ్ కి చెప్పి లాక్ చేసుకున్నాడు. నిజానికి ఎన్టీఆర్ కోసమే దాదాపు ఏడాదిన్నార వెయిట్ చేశాడు బుచ్చిబాబు. ఇప్పుడు చరణ్ సినిమా కోసం కూడా వెయిటింగ్ చేయకతప్పడం లేదు. స్క్రిప్ట్ ఎప్పుడో లాకయింది. కానీ చరణ్ డేట్స్ లేవు. శంకర్ సినిమా అయ్యేంత వరకూ రామ్ చరణ్ మరో సినిమా చేయడానికి వీల్లేదు. దీంతో బుచ్చి బాబు ఇంకా వెయిటింగ్ లోనే ఉంటున్నాడు.

శంకర్ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకా కొన్ని నెలలు పడుతుంది. ఈ ఏడాదంతా షూటింగ్ జరుగూతూనే ఉంటుంది. ఈ లోపు బుచ్చి బాబు మరో సినిమా చేయలేడు, వెయిటింగ్ చేయడం తప్ప। మరి 100 కోట్ల దర్శకుడు చరణ్ కోసం ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలో ?

ఇవి కూడా చదవండి…

దసరా విజయం నానికి కీలకం!

శ్రీదేవి శోభన్‌బాబు..ఓటీటీలోకి ఏప్పుడంటే..?

దీపికా..82°E అంటే ఏంటంటే..?

- Advertisement -