లండన్ : భారత దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాలకు సంఘీభావంగా లండన్‌లో చేప్పట్టిన కారు ర్యాలీకి ఎన్నారై టి.ఆర్.యస్ యూకే మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమని, వీటిని ఉపసంహరించుకోవాలని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాండ్ చేశారు. అలాగే ఎక్కడ కూడా కనీసం ఎమ్మెస్పీపై చట్ట బద్ధత లేకపోవడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరికి నిదర్శమని తెలిపారు.
బిజెపి నాయకులు చెప్తున్నట్టు ఈ పోరాటం ఒక్క పంజాబ్ హర్యానా రైతులదీ మాత్రమే కాదని, దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్నో రైతు సంఘాలు, రవాణా సంఘాలు, చిల్లర వర్తకులు,వ్వవసాయంతో అనుభందం ఉన్న ప్రతి ఒక్కరు మద్దత్తు తెలుపుతున్నారని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి తెలిపారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి ఎన్నారైలు సైతం మద్దతు తెలుపుతున్నారని, రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి గుర్తు చేసి, కొత్త వ్యవసాయ చట్టాల్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేశారు. రైతు సంఘాలు ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని కార్యదర్శి చిలుముల సత్యమూర్తి పిలుపునిచ్చారు.