అగ్నిపథ్ ఆందోళనలు.. ఇవాళ భారత్ బంద్‌..

65
Agnipath Protests
- Advertisement -

దేశంలో అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనకారులు ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. భారత త్రివిధ దళాల్లోకి రెగ్యులర్ నియామకాలను రద్దుచేస్తూ, ఇకపై నాలుగేళ్ల కాంట్రాక్టు పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా కేంద్రం ఈ ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ యువత తీవ్రస్థాయి నిరసనలు చేస్తున్నారు.

ఇక ఈబంద్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి. హర్యానా, ఝార్ఖండ్‌, పంజాబ్‌, కేరళ, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు భద్రతా ఏర్పాట్లు కట్టుదిటం చేశారు. ముఖ్యమైన నగరాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బంద్ పేరుతో ఎవరైనా రోడ్డెక్కితే కఠిన సెక్షన్ల కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

- Advertisement -