జన నేతకు వన కానుక- ఎన్నారై టీఆర్‌ఎస్

164
NRI TRS Anil Kurmachalam
- Advertisement -

మన ముఖ్యమంత్రి జన్మదినాన కోటి మొక్కల ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేద్దాం అని ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 17 హరిత తెలంగాణకి నవ సోపానం ,ఒక గంటలో కోటి మొక్కల మహా యజ్ఞం కోటి వృక్షార్చన పండుగలో మనమూ పాల్గొందాం,ఒక్కొక్కరం మూడు మొక్కలు నాటుదాం అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ చాలా చక్కటి కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఒకరోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఆకుపచ్చ తెలంగాణగా చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా అందరం పాల్గొని విజయవంతం చేయాలని అదే ముఖ్యమంత్రికి మన తరపున హరిత కానుక అని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.

- Advertisement -